అంబేద్కర్ చెప్పిందే కరెక్ట్: మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబేద్కర్ చెప్పిందే కరెక్ట్: మోదీ

పారిశ్రామికీకరణతోనే దళితులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న అంబేద్కర్ వ్యాఖ్యలే కరెక్ట్ అని ప్రధాని మోదీ అన్నారు. నిరు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సుకు మోదీ హాజరై, ప్రసంగించారు. ఉద్యోగాలను సృష్టించేవారిని తయారు చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. అలాంటి వారి వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా 80 లక్షల మంది ఎలాంటి పూచీకత్తులు లేకుండానే రుణాలు పొందారని... వీరిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు, ఓబీసీలే ఉన్నారని తెలిపారు.

More Telugu News