Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదుకు సత్య నాదెళ్ల రాక నేడే!... చంద్రబాబుతో భేటీ, కేటీఆర్ తో కలిసి టీ హబ్ సందర్శన

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నేడు హైదరాబాదుకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలోని టీ హబ్ ను సందర్శిస్తారు. సర్కారీ ఇంక్యుబేటర్ గా భావిస్తున్న టీ హబ్ ను తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేంద్రంగా భావిస్తోంది. ఈ కేంద్రం తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలను సాకారం చేయనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేంద్రాన్ని పరిశీలించనున్న సత్య నాదెళ్ల ప్రభుత్వానికి పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం.

More Telugu News