విమాన దాడులతో బెదిరేది లేదు: ఐఎస్ఐఎస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమాన దాడులతో బెదిరేది లేదు: ఐఎస్ఐఎస్

పశ్చిమ దేశాలు చేస్తున్న విమాన దాడులతో ఐఎస్ఐఎస్ ఎంత మాత్రమూ బెదరబోదని ఇస్లామిక్ స్టేట్ నేత అబూబకర్ అల్ బాగ్దాదీ తన తాజా వీడియోలో చెప్పాడు. గత మేలో వీడియో మెసేజ్ ని విడుదల చేసిన ఆయన ఆపై మరో వీడియోలో కనిపించడం ఇదే తొలిసారి. మొత్తం 24 నిమిషాల నిడివి వున్న వీడియోలో సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ చేస్తున్న దాడులను ప్రస్తావించాడు. కాలిఫేట్ లో పాలన సజావుగా సాగుతోందని, ఇస్లాంపై విశ్వాసమున్న ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని కూడా చెప్పాడు. కాగా, యూఎస్ నేతృత్వంలోని సిరియా కుర్దిష్ లు, అరబ్, క్రిస్టియన్ గ్రూప్ వర్గాలు ఉత్తర సిరియాలో ఉగ్రవాదుల అధీనంలో ఉన్న యూఫరేట్స్ నదిపై ఉన్న కీలక డ్యామ్ ను స్వాధీనం చేసుకున్నాయి.

More Telugu News