భారత్, పాక్, బంగ్లా తప్పకుండా ఒక్కటవుతాయి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్, పాక్, బంగ్లా తప్పకుండా ఒక్కటవుతాయి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు మళ్లీ ఒక్కటవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అంటున్నారు. దాంతో అఖండ భారతావని ఏర్పడుతుందని ఢిల్లీలో పేర్కొన్నారు. కేవలం 60 సంవత్సరాల కిందట చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు కలవడం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకా విశ్వాసం ఉందని మాధవ్ చెబుతున్నారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళతామని లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదన్నారు. విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇదంతా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని హిందూ దేశంగా అభివర్ణించడంపై మాధవ్ మాట్లాడుతూ, అదొక సంస్కృతి మాత్రమేనన్నారు. దేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని తెలిపారు.

More Telugu News