ఇక తలచినప్పుడే గర్భధారణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక తలచినప్పుడే గర్భధారణ!

గర్భధారణ తాము కోరుకున్నప్పుడే స్వీకరించే అవకాశం ఉంటే బాగుండునని అతివలు చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి ఇది శుభవార్తే. ఎందుకంటే.. మహిళల్లో గర్భధారణ వాయిదా వేసుకోవడానికి దోహదం చేసే జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించే మార్గంలో ఉన్నారు. ఎలుకలతో పాటు కొన్ని క్షీరదాల్లో జరిపిన పరిశోధనల్లో అలాంటి జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇప్పుడు మనుషులపై అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. కొన్ని జంతువులు కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా గర్భధారణ వాయిదా వేసుకునే పరిస్థితులు ఉంటాయని వారు గుర్తించారు. దీన్ని ఎంబ్రియోనిక్‌ డయాపాజ్‌ అంటారు. దీనికి ఉపయోగపడే జన్యువులేమిటో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

సిన్సినాటీ చిల్డ్రన్స్‌ రీసెర్చి ఫౌండేషన్‌కు చెందిన సుధాంశు డే బృందం ఎలుకలపై అధ్యయనం చేసింది. గర్భధారణకు సంబంధించి.. ఎంఎస్‌ఎక్స్‌1 అనే జన్యువు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇది కీలకం కావచ్చునని అనుకుంటున్నారు. ఎలుకల తర్వాత ఇతర జంతువులపై ఇప్పుడిప్పుడే పరిశోధనలు చేస్తున్నారు. డయాపాజ్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటే.. మనుషుల్లో కూడా ఎంఎస్‌ఎక్స్‌1 జన్యువు ప్రభావాలను గుర్తించవచ్చునని వారు భావిస్తున్నారు.

More Telugu News