Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు రష్యా పర్యటనకు వెళుతున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రష్యా పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అవుతారు. అణుశక్తి, హైడ్రోకార్బన్, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలు విస్తరింపజేసుకునే అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేస్తారు. 2000 సంవత్సరం నుంచి రష్యా, భారత్ లు ఓ ఏడాది మాస్కోలో, మరో ఏడాది న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News