స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం!... వైసీపీ అధినేత జగన్ నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం!... వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సభాపతి కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. తమ పార్టీ సభ్యురాలు ఆర్కే రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని జగన్ స్పీకర్ ను కోరారు. దీనిపై ఘాటుగా స్పందించిన అధికార పక్షం ఆ నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. దీంతో శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేస్తూ వైసీపీ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత వైసీఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. రేపు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే సమావేశాలనే బాయ్ కాట్ చేసిన వైసీపీ... అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ప్రవేశపెడుతుందన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

More Telugu News