Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అక్కినేని ఫౌండేషన్’ పురస్కారాలు...కైకాల సత్యనారాయణకు సినీ రత్న పురస్కారం

ప్రముఖు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ‘అక్కినేని ఫౌండేషన్’ సినీ రత్న పురస్కారాన్ని అందజేసింది. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాల వేడుక హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుమార్తె నాగ సుశీల, మనవళ్లు సుమంత్, సుశాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాలను పలువురికి అందజేశారు. అలనాటి అందాల తార జమునకు అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ పురస్కారాన్ని అందజేశారు.

More Telugu News