Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా కేబినెట్ మీటింగ్ ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు: కేజ్రీవాల్

ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి చేసిన సీబీఐ తమ కేబినెట్ మీటింగ్ కు సంబంధించిన ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం సీబీఐకి ఏముందని ప్రశ్నించారు. డీడీసీఏ పనితీరుపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండటం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి భయం కలిగిస్తోందని అన్నారు. సీబీఐ దాడులపై రాజ్యసభలో జైట్లీ చేసిన వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని చెప్పారు. తమ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంలో జరిగిన దాడులు తనను లక్ష్యంగా చేసుకునే జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు.

More Telugu News