ఐఎస్ కు మరోసారి ఒబామా హెచ్చరిక... అంతం చేస్తామని ప్రకటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఎస్ కు మరోసారి ఒబామా హెచ్చరిక... అంతం చేస్తామని ప్రకటన

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థను హెచ్చరించారు. తమ తదుపరి లక్ష్యం ఐఎస్ నాయకులేనని, ఎక్కడున్నా వారిని అంతం చేస్తామని స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలో దాడి తరువాత ఆ దేశ మిలటరీ అధికారులతో సమావేశమై ఒబామా చర్చించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇరాక్, సిరియాలో ఉన్న ఐఎస్ ఉగ్రవాదులను నిర్మూలించడానికి అమెరికా, మిత్రదేశాలే కలసికట్టుగా పోరాడుతాయని తెలిపారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తమ పోరాటాన్ని ముమ్మరం చేసినట్టు వివరించారు. "ఐఎస్ నాయకులు ఎక్కడా తలదాచుకోలేరు. మేం ఐఎస్ నాయకులకు పంపే సందేశం ఒక్కటే. మా టార్గెట్ మీరే" అని సమావేశంలో పేర్కొన్నారు. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్న కొత్త దశ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటామని ప్రకటించారు.

More Telugu News