Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి అచ్చెన్నాయుడిపై ధర్మాన అవినీతి ఆరోపణలు

ఏపీ కార్మిక, క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అవినీతికి కేంద్ర బిందువు ఆయనేనని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. గత రెండు దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులకు బదిలీలు చేయించేందుకు, ఎమ్మార్పీ ధరలు పెంచుకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేందుకు మంత్రి లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 230 మద్యం దుకాణాలు ఉంటే ఒక్కొక్క షాపు నుంచి లక్షల్లో ముడుపులు అందుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

More Telugu News