ఆన్ లైన్ లో అమ్మకానికి ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ ఇల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆన్ లైన్ లో అమ్మకానికి ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ ఇల్లు

ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ మహమ్మద్ అలీ జిన్నాకు చెందిన ఇల్లు ఆన్ లైన్ లో అమ్మకానికి వచ్చింది. న్యూజెర్సీ చెర్రీ హిల్స్ లోని నందనవనం మధ్య ఒకటిన్నర ఎకరం, 6,688 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో అద్భుతంగా నిర్మించిన భవనాన్ని ఐదున్నర కోట్లకు లిస్టింగ్ ఏంజెంట్ చెరిల్ డేర్ అమ్మకానికి పెట్టారు. ఈ భవనంలో మహమ్మద్ అలీ జిన్నా 1971 నుంచి 74 వరకు నివసించారు. ఇక్కడున్న సమయంలోనే ఆయన ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ లో ఓడిపోయారట. ఆ తరువాత విజయం సాధించారు. ఈ భవనంలో మొత్తం ఐదు బెడ్ రూంలు, ఐదు బాత్ రూంలు, విశాలమైన హాలు, 45 అడుగుల బార్ ఉంది. సబ్ జీరో రిఫ్రిజరేటర్, రెండు ఓవెన్లు, గ్రిల్, ప్రయర్, వైన్ కూలర్, జాగ్వర్ వంటి సౌకర్యాలతో ఆధునిక కిచెన్ ను రూపొందించారు. ఇక డైనింగ్ హాల్ లో అందమైన గ్లాస్ శాండిలియర్లు ఉన్నాయి. అలీ ఎక్కువగా తన కుటుంబ సభ్యులతో డైనింగ్ హాల్లోనే గడిపేవారని చెబుతున్నారు. భవనం వెలుపల 40 అడుగుల పొడవైన స్విమ్మింగ్ పూల్, అవసరానికి తగ్గట్టుగా వాలీబాల్, షటిల్ బోర్డ్ కోర్టుగా మలుచుకునే అవకాశం ఉన్న టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. విశాలమైన ఆట స్థలం కూడా ఉంది. అయితే ఈ భవనానికి వెలకట్టలేమని, దాన్ని దక్కించుకోవడమంటే చరిత్రను సొంతం చేసుకోవడమేనని, చరిత్రలో భాగస్వామ్యం అవడమేనని చెరిల్ డేర్ అంటున్నారు.

More Telugu News