కటకటాల పాలైన కజకిస్థాన్ మాజీ ప్రధాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కటకటాల పాలైన కజకిస్థాన్ మాజీ ప్రధాని

కజకిస్థాన్ మాజీ ప్రధాని సెరిక్ అఖ్ మెతోవ్ జైలు పాలయ్యారు. ఆ దేశ కోర్టు ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న సమయంలో సెరిక్ పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ గత కొద్ది కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ తానెలాంటి తప్పు చేయలేదని, కావాలనే తనపై కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని, క్షమించాలంటూ అధ్యక్షుడు నర్సుల్తాన్ నబర్ బయేవ్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆయన విజ్ఞప్తిని అధ్యక్షుడు తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు తుదివాదనలు జరిపిన కోర్టు ఇవాళ జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ఆ దేశంలో జైలు శిక్షను అనుభవించనుండటం ఇదే తొలిసారి. మొత్తం 17 మంది ఈ కేసులో ఉండగా ముగ్గురు బయటపడ్డారు. మిగతావారికి వారి నేరాలను బట్టి శిక్ష వేశారు.

More Telugu News