Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ‘గిడ్డి’ తీవ్ర వ్యాఖ్య... బాక్సైట్ జోలికోస్తే తల నరుకుతామని ప్రకటన

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన బాక్సైట్ వ్యతిరేక సభలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత సమక్షంలోనే ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాక్సైట్ జోలికొస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటించిన గిడ్డి ఈశ్వరి సభకు హాజరైనవారిని షాక్ కు గురి చేశారు. ఆవేశపూరితంగా ప్రసంగించిన ఈశ్వరి... చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకూ దిగారు. చంద్రబాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగానూ ఆమె అభివర్ణించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ నిషేధిత మావోయిస్టులు ముగ్గురు టీడీపీ గిరిజన నేతలను అపహరించిన ఘటనను ప్రస్తావించిన ఈశ్వరి, పార్టీ జెండా మోసిన గిరిజనులకు కష్టం వస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని నిందించారు. బాక్సైట్ తవ్వకాలపై పోరాటానికి మద్దతుగా తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె, టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ ను కూడా గల్లంతు చేేస్తానని చెప్పారు. ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆమె సవాల్ చేశారు.

More Telugu News