Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలిఫోర్నియాలో హిందూ ధర్మ కేంద్రానికి 30 కోట్ల భూరి విరాళం

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయనున్న హిందూ ధర్మ కేంద్రానికి ఎన్నారై జంట 30 కోట్ల రూపాయల భూరి విరాళం ప్రకటించింది. కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేట్ థియొలాజికల్ యూనియన్ (జీటీయూ) లో హిందూ ధర్మకేంద్రాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. దీని నిమిత్తం బే ఏరియాకు చెందిన అజయ్ సింఘాల్, మీరా సింఘాల్ జంట హిందూ అధ్యయన కేంద్రం కోసం ఒక ఎండోమెంట్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం హిందూ స్టడీస్ లో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, ఎంఏ, పీహెచ్ డీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కేవలం హిందూ మతమే కాకుండా, భారత్ లో పుట్టిన బౌద్ధ, జైన మతాలపైన కూడా అధ్యయనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అజయ్ సింఘాల్ మాట్లాడుతూ, తాము తీసుకెళ్లకపోతే తమ పిల్లలు దేవాలయానికి వెళ్లరని, దేవాలయాలు సురక్షితంగా ఉండాలంటే భవిష్యత్ తరాలు మతం గురించిన విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు.

More Telugu News