వరంగల్ ఎమ్మెల్సీగా కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక
వరంగల్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆ సీటు టీఆర్ఎస్ పరమైంది. ఈ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులను మినహాయిస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి మురళీ ఒక్కరే నామినేషన్ వేశారు. దాంతో ఆయనకు పోటీగా ఎవరూ లేరు. కాగా మురళీ ఎన్నికను ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కొండా మురళీ, సురేఖ దంపతులు వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికలో సురేఖ ఎమ్మెల్యేగా గెలవగా, ఇప్పుడు ఆమె భర్త ఎమ్మెల్సీ అయ్యారు.