తిరుచానూరు అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ ఆభరణాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుచానూరు అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ ఆభరణాలు

కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సమయంలో అలంకరించేందుకు ఏడు రకాల మాలలు, కిరీటం, కుచ్చు జడను ఉపయోగిస్తారు. అయితే ఈసారి ఎప్పటికంటే భిన్నంగా అమ్మవారికి తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన రాజేందర్ అనే భక్తుడు బాదం పప్పు, వట్టి, కురు వేర్లు, రోస్ పెటల్స్, సంపంగిని ఉపయోగించి మాలలు, కిరీటం, కుచ్చు జడను తయారు చేయించారు. వాటిని నిన్న(బుధవారం) టీటీడీ ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులకు అందించారు. ఇవాళ వాటిని స్నపన తిరుమంజనంలో అలంకరించనున్నారు. అలాగే తిరుమంజనంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు న్యూజిలాండ్ కివీ ఫ్రూట్స్, ఆస్ట్రేలియా ఆరెంజ్, అమెరికన్ గ్రేప్స్, డేట్స్ తదితర పండ్లను దాత అందించినట్టు చెప్పారు.

More Telugu News