హెచ్-1బీ వీసాల్లో కోత కోరుతూ యూఎస్ సెనెట్ లో బిల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్-1బీ వీసాల్లో కోత కోరుతూ యూఎస్ సెనెట్ లో బిల్లు

తక్కువ వేతనానికి విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చేందుకు వీలు కల్పిస్తూ, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ వీసాల విధానాన్ని కఠినం చేయాలని, ఏటా 15 వేల వీసాలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, యూఎస్ సెనెట్ లోకి ఓ బిల్లు వచ్చింది. రిపబ్లికన్ సెనెటర్ జెఫ్ సెషన్స్, డెమొక్రటిక్ సెనెటర్ బిల్ నెల్సన్ దీన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుండగా, వాటిని 70 వేలకు కుదించాలన్నది ఈ బిల్లు ప్రధానోద్దేశం. అధికార, విపక్ష సభ్యులు సంయుక్తంగా ప్రవేశపెట్టిన బిల్లుపై సెనెట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా ఉగ్ర కార్యకలాపాలు జరిగితే, వాటిని వెంటనే లా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి తెలిపేలా నిబంధనలు సడలించాలంటూ మరో బిల్లు సెనెట్ ముందుకు వచ్చింది.

More Telugu News