సుప్రీం చీఫ్ జస్టిస్ ను కలిసిన ఇద్దరు చంద్రులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుప్రీం చీఫ్ జస్టిస్ ను కలిసిన ఇద్దరు చంద్రులు!

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ నిన్న వేర్వేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ను కలిశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఠాకూర్ ఇటీవలే ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఇద్దరు చంద్రులు జస్టిస్ ఠాకూర్ తో నిన్న భేటీ అయ్యారు. కొత్తగా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపేందుకే చంద్రబాబు జస్టిస్ ఠాకూర్ ను కలిశారట. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో జరగాల్సిన హైకోర్టు విభజనకు సంబంధించిన జాప్యంపై ఫిర్యాదు చేసేందుకే కేసీఆర్ జస్టిస్ ఠాకూర్ ను కలిశారు. జస్టిస్ ఠాకూర్ కు అభినందనలు తెలుపుతూనే, హైకోర్టు విభజన జరగని కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేసీఆర్ ఏకరువు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

More Telugu News