చెన్నై వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీకి జయ లేఖ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. చెన్నై భారీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆమె కోరారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. నగరంలోని అన్ని ప్రాంతాలు కొన్ని రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ సమయంలో ప్రధాని చెన్నైలో ఏరియల్ సర్వే చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తక్షణ సాయంగా అప్పుడు రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు.