Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యం మత్తులో రష్యా దౌత్యవేత్త.. ఢిల్లీ రోడ్లపై నానా బీభత్సం

మద్యం మత్తు తలకెక్కిన రష్యా దౌత్యవేత్త ఒకరు నిన్న భారత రాజధాని ఢిల్లీలో బీభత్సం సృష్టించారు. నడి రాత్రి దాకా భారీ మోతాదులో మద్యం సేవించిన సదరు దౌత్యవేత్త నిన్న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో నగరంలోని మోతీబాగ్ లో కారుతో దూసుకెళ్లారు. మద్యం కారణంగా దాదాపుగా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆ దౌత్యవేత్త వేగంగా కారు నడిపి ముందు వెళుతున్న ఓ బైక్ ను ఢీకొట్టారు. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. దీనిని గమనించిన ఢిల్లీ కానిస్టేబుల్ ఒకరు ఆ కారును నిలువరించే యత్నం చేశారు. సదరు పోలీస్ కానిస్టేబుల్ మాటను లెక్కచేయకుండా పోలీసులు రోడ్డుపై పెట్టిన బారికేడ్లను ఆ దౌత్యవేత్త తన కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత బారీకేడ్ల కారణంగా కారు నిలిచిపోగా, కారు నుంచి తనను కిందకు దించేందుకు యత్నించిన కానిస్టేబుల్ ను ఆయన నెట్టేయడమే కాక కొట్టినట్లు కూడా తెలుస్తోంది. బారికేడ్లను కారు ఢీకొట్టిన కారణంగా దౌత్యవేత్త కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముక్కు, నోటి నుంచి రక్తం వస్తున్న దౌత్యవేత్తను ఆయన స్నేహితుడు ఒకరు ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించడమే కాక నానా బీభత్సం చేసిన సదరు దౌత్యవేత్తపై సమచారం అందుకున్న రష్యా రాయబార కార్యాలయం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

More Telugu News