Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులకు వైఎస్ జగన్ విన్నపం

విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో కల్తీ మద్యం తాగిన ఘటన అటు అధికార పార్టీ నేతలనే కాక ఇటు విపక్ష నేతలను కూడా కలచివేసిందనే చెప్పాలి. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా, 29 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. నిన్న బాధితులను పరామర్శించేందుకు విజయవాడ వెళ్లిన విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పేరు పేరునా పలకరించారు. వారితో మాట కలిపారు. ‘‘అన్నా.. మళ్లీ మద్యం తాగకు, ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకు. ప్రాణాల మీదకు తెచ్చుకోకు. నీ కుటుంబాన్ని మద్యం ఇబ్బంది పెడుతోంది. ఇకనైనా మద్యం మానేయండి’’ అంటూ జగన్ బాధితులను కోరారు. ఆ తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన జగన్, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

More Telugu News