చంద్రబాబు ప్రధాని, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ జోస్యం
ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురించి టీడీపీ ఎమ్మెల్సీ వైబీవీ రాజేంద్రప్రసాద్ సరికొత్త జోస్యం చెప్పారు. 2019లో చంద్రబాబు ప్రధాని, వెంకయ్య రాష్ట్రపతి అవుతారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీని చూసుకుంటారని చెప్పుకొచ్చారు. బాబు, వెంకయ్యలు లివింగ్ లెజెండ్స్ అని, వారిద్దరి ఆధ్వర్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో తెలుగు జాతికి వెంకయ్యే దిక్కని అన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ ఈ మేరకు మాట్లాడారు. హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న కొంతమందిపై ఆయన విమర్శలు చేశారు. పదిమంది నీళ్లలో దీక్ష చేస్తే హోదా రాదన్నారు. మీడియా కవరేజీ కోసమే హోదా ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.