తల వంచకుండానే హక్కులు సాధించుకోవచ్చు: కాపులకు కన్నా సూచన
ఆంధ్ర రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న కాపులు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదని... పోరాటం ద్వారా హక్కులను సాధించుకుందామని బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగే కాపు ఉద్యమ సభకు కాపులంతా హాజరుకావాలని అన్నారు. ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులంతా ఉద్యమించాలని చెప్పారు. ప్రభుత్వ హామీలన్నింటినీ నెరవేర్చుకునే దిశగా ఉద్యమిద్దామని తెలిపారు.