పాకిస్థాన్ లో ప్రొఫెసర్ అరెస్ట్... ఐఎస్ తో సంబంధాలు
తమ దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న ఓ ప్రొఫెసర్ ను అరెస్ట్ చేసింది. పంజాబ్ లోని యూనివర్శిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారంలో అరెస్ట్ చేసిన ఉగ్ర నేత హిజ్బుత్ తో గలీబ్ కు సంబంధాలు ఉన్నాయని తమ విచారణలో తేలిందని పాక్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రత్యేక రైడింగ్ జరిపి గలీబ్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. తీవ్రవాద భావజాల వ్యాప్తికి సంబంధించిన సమావేశాలకు గలీబ్ హాజరయ్యాడని... ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడని తెలిపారు.