శంషాబాదులో టీఆర్ఎస్ కు షాక్... ఎంపీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాదులో టీఆర్ఎస్ కు షాక్... ఎంపీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శంషాబాదు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు అధికార పార్టీకి సవాల్ విసిరిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అక్కడ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేష్మా ఇండిపెండెంట్ అభ్యర్థిపై 17 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. ఊహించని ఈ ఫలితంలో టీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు.

More Telugu News