బెజవాడకు వైఎస్ జగన్... కల్తీ మద్యం బాధితులకు పరామర్శ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడ వెళ్లనున్నారు. నిన్న నగరంలోని కృష్ణలంకకు చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృత్యువాత పడగా, మరో 29 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ మద్యం బాధితులను పరామర్శించేందుకే వైఎస్ బెజవాడ వెళుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్న జగన్ మృతుల కుటుంబాలను కూడా కలవనున్నారు. ఈ ఘటనపై నిన్ననే స్పందించిన జగన్, సమగ్ర విచారణ చేపట్టి బాధితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.