నకిలీ మద్యానికి మరొకరు బలి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యానికి మరొకరు బలి అయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పాండురంగ వైన్స్ లో విక్రయిస్తున్న మద్యం తాగిన సంఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా, విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో కల్తీ మద్యం తాగిన సంఘటనలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.