నేను నిరపరాధిని...నన్ను ఇరికించారు: తోటి ఖైదీలతో ఇంద్రాణీ ముఖర్జియా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను నిరపరాధిని...నన్ను ఇరికించారు: తోటి ఖైదీలతో ఇంద్రాణీ ముఖర్జియా

కూతురు షీనా బోరా హత్య కేసులో తనను కుట్రపూరితంగా ఇరికించారని ఆ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా తోటి ఖైదీలతో చెబుతోంది. షీనా బోరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని పదే పదే చదువుతున్న ఇంద్రాణీ ముఖర్జియా తాను నిరపరాధినని తోటి ఖైదీలతో వ్యాఖ్యానిస్తోందట. తరచు తెల్ల కాగితాలు అడిగి నోట్సు రాసుకుంటోందని, ప్రతి రోజూ తన లాయర్లతో సమావేశమవుతూ, తనపై సంధించే ప్రశ్నల గురించి తెలుసుకుంటోందని జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇతర సాక్షుల వాంగ్మూలాల ప్రతులు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆమె అభ్యర్థించినట్టు సమాచారం.

More Telugu News