వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ జయకేతనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ జయకేతనం

వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమెక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ పార్టీ గెలుపు సాధించింది. 99 సీట్లు దక్కించుకుని అధికారం చేజిక్కించుకుంది. రాజకీయ ఖైదీల విడుదలపై రౌండ్ టేబుల్ పార్టీ తమ మానిఫెస్టోలో చెప్పడం వల్లే తమకు భారీగా ఓట్లు పడ్డాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో ఆ దేశంలో రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సోషలిస్టు పార్టీ ఓటమి పాలైంది. ఆ పార్టీకి 46 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ఐదు గంటల్లో వెల్లడైన ఫలితాలతో... ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు మాడురో తెలిపారు. ఈ ఎన్నికల కోసం సెంటర్, కన్జర్వేటివ్ పార్టీ ఓ కూటమిగా పోటీ చేశాయి.

More Telugu News