Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా... మన్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

ఈ నెల 26న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ మీడియాకు ఆ పార్టీ ఏవోబీఎస్ జడ్ సీ కార్యదర్శి చంద్రమౌళి ఓ లేఖను విడుదల చేశారు. 21 నుంచి 27 వరకు నిరసన దినాలు పాటించాలని ప్రజలకు ఈ లేఖలో ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు బాక్సైట్ గనులను ఆన్ రాక్ కి అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నాయని అందులో ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు దేశంలోని అపార ఖనిజ సంపదను అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నాయని చంద్రమౌళి విమర్శించారు.

More Telugu News