ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు చంద్రబాబు... నారా లోకేశ్ కూడా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు చంద్రబాబు... నారా లోకేశ్ కూడా!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. టీడీపీ చేపట్టిన జనచైతన్య యాత్రల్లో భాగంగా నేడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరగనున్న కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరులో నిర్వహించనున్న జనచైతన్య యాత్రలో పాల్గొని, అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం విజయనగరం జిల్లా వెళ్లనున్న చంద్రబాబు ఎస్. కోట నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోటలో జనచైతన్య యాత్రలో పాలు పంచుకుంటారు. ఇదిలా ఉంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ యువనేత నారా లోకేశ్ కూడా నేడు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని చీడికాడలో జరగనున్న జనచైతన్య యాత్రకు హాజరుకానున్న లోకేశ్, అక్కడ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఈ పర్యటనల అనంతరం చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా నేరుగా విజయవాడ చేరుకుంటారు.

More Telugu News