గౌహతిలోని ఫ్యాన్సీ బజార్ లో పేలుళ్లు... ఇద్దరికి గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గౌహతిలోని ఫ్యాన్సీ బజార్ లో పేలుళ్లు... ఇద్దరికి గాయాలు

అసోంలో అతిపెద్ద నగరమైన గౌహతిలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. స్థానిక ఫ్యాన్సీ బజార్ ప్రాంతంలో కొద్దిసేపటి కిందట రెండు పేలుళ్లు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారని తెలిసింది. పోలీసులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News