సల్మాన్ కు మరింత ఊరట... బెయిల్ రద్దుకు అంగీకరించని సుప్రీం
2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసులో జైలు శిక్ష పడి, ఆపై బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్ కు మరింత ఊరట లభించింది. ఆయన పొందిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ, కానిస్టేబుల్ రవీందర్ పాటిల్ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది. ఈ కేసులో విచారణ పూర్తి పారదర్శకంగా సాగిందని, బెయిల్ రద్దు కుదరదని తేల్చింది. కాగా, ఈ కేసు విచారణ తరువాత గడచిన మేలో సెషన్స్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బాంబే హైకోర్టు శిక్షను నిలుపుదల చేస్తూ, సల్మాన్ కు బెయిల్ ను మంజూరు చేసింది.