తగ్గిన అడయార్ నది ఉద్ధృతి... జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న కాలనీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తగ్గిన అడయార్ నది ఉద్ధృతి... జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న కాలనీలు

భారీ వర్షాలతో నిండిపోయిన చెన్నైలోని అడయార్ నది కొద్ది కొద్దిగా శాంతిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో మూడు రోజుల పాటు వందల కాలనీలను నీటితో ముంచేసిన ఈ నది ప్రవాహం తగ్గుతోంది. దాంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. చెంబరంపాకం, కత్తిపార, గిండి, సైదాపేట ప్రాంతాలలో నీరు తగ్గిపోయింది. ఈ క్రమంలో ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అయితే నాలుగు రోజుల నుంచి విద్యుత్ లేకపోవడంతో చెన్నై నగరమంతా అంధకారమైంది.

More Telugu News