త్వరలో సల్మాన్ ఖాన్ జీవితచరిత్రపై పుస్తకం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో సల్మాన్ ఖాన్ జీవితచరిత్రపై పుస్తకం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవిత చరిత్రపై త్వరలోనే ఒక పుస్తకం రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఒక ప్రముఖ సినిమా స్టార్ జీవిత చరిత్రపై వస్తున్న పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సల్మాన్ జీవిత చరిత్ర పుస్తకంలో సినిమా ఇండస్ట్రీలోకి ఆయన ప్రవేశించడం, క్రమేపి స్టార్ గా ఎదగడం వంటి విషయాలను ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా, సల్మాన్ కుటుంబ నేపథ్యం గురించిన వివరాలు ఇందులో పొందుపరచనున్నట్లు ప్రచురణ కర్తలు తెలిపారు. సల్మాన్ ఖాన్ 50వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.

More Telugu News