కోహినూర్ వజ్రాన్ని పాకిస్థాన్ తీసుకురండి: పాక్ న్యాయవాది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహినూర్ వజ్రాన్ని పాకిస్థాన్ తీసుకురండి: పాక్ న్యాయవాది

కోహినూర్ వజ్రాన్ని తమ దేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ పాకిస్తాన్ కు చెందిన ఓ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాజు రంజిత్ సింగ్ మనవడు దిలీప్ సింగ్ దగ్గర్నుంచి బ్రిటన్ కోహినూరు వజ్రాన్ని దోచుకెళ్లిందని న్యాయవాది జావెద్ ఇక్బాల్ జాఫ్రీ ఆరోపించారు. 1953లో క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం సమయంలో ఆమె కిరీటంలో దీనిని పొదిగారని, ఆ వజ్రంపై వారికి ఎలాంటి హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. కోట్ల విలువ చేసే కోహినూర్ వజ్రం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రజల ఆస్తి అని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, గుంటూరులోని కొల్లూరు గనుల్లో కోహినూర్ వజ్రం దొరికిందన్నది జగద్విదితం. దీని కోసం భారత ప్రభుత్వం దశాబ్దాలుగా పోరాడుతోంది. బ్రిటన్ లోని ఓ స్వచ్ఛంద సంస్థ దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు సమాచారం. ఈ దశలో కోహినూర్ వజ్రం తమదంటూ పాక్ న్యాయవాది డిమాండ్ చేయడం విశేషం.

More Telugu News