Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా బ్యూటీకి హ్యాండ్ ఇచ్చిన జాకీచాన్

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషికం తీసుకుంటూ, ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ బాట పట్టింది గోవా బ్యూటీ ఇలియానా. ఎన్నో ఆశలతో ముంబై చేరుకున్న ఈ ముద్దుగుమ్మకు కొన్ని అవకాశాలు దక్కినా, సక్సెస్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఇల్లీకి అవకాశాలు ఇచ్చేవారు కూడా కరవయ్యారు. దీంతో, మళ్లీ దక్షిణాది బాట పట్టాలనే ఆలోచనలో ఉన్న ఇలియానాకు అనుకోకుండా బంపర్ ఆఫర్ తగిలింది. హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ హీరోగా రూపొందుతున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో భారతీయ యువతి పాత్రకు ఇలియానాను ఎంపిక చేశారు. దీంతో, ఇలియానా ఉబ్బితబ్బిబ్బయింది. అయితే, ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇలియానా స్థానంలో అమైరా దస్తర్ ను తీసుకున్నారట. దీంతో, ఇల్లీ షాక్ కు గురైంది. ప్రస్తుతం తెలుగులో పూరీ తీస్తున్న 'రోగ్'తో బాటు, మంచు విష్ణు సరసన కూడా అమైరా హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News