Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ నాకేనాడూ అన్యాయం చేయలేదు... అయినా కేసీఆర్ అభివృద్ధి ఆకట్టుకుంది: సాయన్న కామెంట్లు

‘సైకిల్’ దిగి ‘కారు’ ఎక్కిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ తో కలిసి ఆయన కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన సాయన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తనకు ఏనాడూ అన్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. అయినా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. పార్టీల కంటే తన నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్ లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో సీఎం కేసీఆర్ కీలక భూమిక పోషించారన్నారు. ఈ కారణంగానే కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరానని ఆయన ప్రకటించారు.

More Telugu News