భారీ వర్షాలతో ఏపీలో 81 మంది మృతి: చినరాజప్ప
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వర్షాలతో ఏపీలో 81 మంది మృతి: చినరాజప్ప

గత కొన్నిరోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 81 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం సంభవించిందని వివరించారు. రూ.6,750 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు. మరోవైపు చెన్నైలో ఉన్న తెలుగువారి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. భారీ వర్షాలకు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు.

More Telugu News