చెన్నైలో వందేళ్ల ‘వర్షం’ రికార్డు బద్దలు... 120 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైలో వందేళ్ల ‘వర్షం’ రికార్డు బద్దలు... 120 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు

తమిళనాడు రాజధాని చెన్నైలో 1918లో రికార్డు వర్షపాతం నమోదైంది. నాడు నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీ మీటర్ల వర్షపాతాన్ని కుమ్మరించాడు. నిన్నటిదాకా అదే చెన్నై నగరంలో కురిసిన అత్యధిక వర్షపాతం. దాదాపుగా వందేళ్ల దాకా మళ్లీ అంతటి వర్షపాతం నమోదు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షం మాత్రం వందేళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిన్న కూడా ఎడతెరిపి లేని వర్షం చెన్నైని ముంచెత్తింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం రాత్రికే చెన్నైలో అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలు కాగా, వరుణుడు శాంతించేలోగా సరికొత్త రికార్డులు నమోదు కానున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News