పాక్ లో తరచూ మకాం మారుస్తున్న దావూద్... లోక్ సభకు తెలిపిన కేంద్ర హోంశాఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ లో తరచూ మకాం మారుస్తున్న దావూద్... లోక్ సభకు తెలిపిన కేంద్ర హోంశాఖ

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన వివరాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌదరి ఈరోజు లోక్ సభకు తెలిపారు. 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు అయిన దావూద్ పాకిస్థాన్ లోనే తలదాచుకుంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు తెలియజేస్తూనే ఉన్నాయన్నారు. అయితే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తన స్థావరాన్ని మారుస్తున్నాడని తెలిపారు. దావూద్ వివరాలు, అతడి పాస్ పోర్టు, నివాస చిరునామాకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పాక్ అధికారులు భారత్ కు అందజేస్తూనే ఉన్నారని వివరించారు. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిని తమకు అప్పగించాలని పాక్ ను కోరుతూ వస్తున్నామన్నారు. భారత్ కు అతడిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు. దావూద్ పై రెడ్ కార్నర్ నోటీసు, ఐరాస తీర్మానం నేపథ్యంలో వివిధ మార్గాల ద్వారా పాక్ పై ఒత్తిడి తెస్తున్నామని హరిభాయ్ చౌదరి పేర్కొన్నారు.

More Telugu News