Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుక్కి నేనెప్పుడూ సలహాలివ్వలేదు: బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్

తన కొడుకు క్రమశిక్షణ ఉన్న ఆటగాడని, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడని.. అందుకే టైగర్ ష్రాఫ్ కి ఎటువంటి సలహాలు ఇవ్వనని బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘టైగర్’ కెరీర్ లో తన పాత్రేమీ లేదని, సరైన పద్ధతిలోనే అతన్ని పెంచామని చెప్పుకొచ్చాడు. ‘టైగర్’ చదువు విషయంలోనూ తానెప్పుడూ సలహాలు ఇవ్వలేదన్నారు. అతడి కెరీర్ సాఫీగా సాగుతోందంటూ జాకీష్రాఫ్ తన కొడుకు గురించి చెప్పారు.

More Telugu News