: ఇక జర్నలిస్టుల వంతు... నేడు మీడియాతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ


పార్లమెంటు సమావేశాల్లో అనుకున్నది సాధించుకునేందుకు ఓ మెట్టు దిగిన ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలకు తేనీటి విందు ఇచ్చారు. తాజాగా మీడియాను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ నేడు మరో ముందడుగు వేస్తున్నారు. దీపావళికి ముందు ఏటా నిర్వహిస్తున్న ‘దివాలీ మంగళ్ మిలన్’ కాస్త ఆలస్యంగా నేడు జరుగుతోంది. ప్రధాని విదేశీ పర్యటనల నేపథ్యంలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కంటే కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ఈ సమావేశంలో నేడు మీడియా ప్రతినిధులతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ బేటీలో మీడియా సంస్థల ప్రతినిధులు, సీనియర్ ఎడిటర్లు పాల్గొననున్నారు. ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో మంత్రి రవి శంకర్ ప్రసాద్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News