‘మావో’ల కదలికలపై నిఘా: ఏపీ మంత్రి చినరాజప్ప
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మావో’ల కదలికలపై నిఘా: ఏపీ మంత్రి చినరాజప్ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణ నిమిత్తం పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతోపాటు నైట్ బీట్, హై క్లిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే నెట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. పోలీస్ వ్యవస్థలో ఆక్టోపస్‌ విభాగాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. నకిలీ కరెన్సీ చలామణీపై నిఘా పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టామని చినరాజప్ప వెల్లడించారు.

More Telugu News