గుడివాడ వైకాపా కార్యాలయానికి తాళం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుడివాడ వైకాపా కార్యాలయానికి తాళం!

దీర్ఘకాలంగా అద్దెను చెల్లించడం లేదన్న కారణంతో గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, భవన యజమాని తాళం వేశారు. దీంతో గుడివాడలో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత కొడాలి నాని ఇంటి యజమానితో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యాలయానికి తాళం ఎలా వేస్తారని నాని ప్రశ్నిస్తుండగా, గతంలో పలుమార్లు హెచ్చరించామని, అద్దె ఇవ్వకపోతే ఎంతకాలం ఎదురుచూడాలని యజమాని అడిగారు.

More Telugu News