‘సారీ, సమ్ థింగ్ వెంట్ రాంగ్’... ఫేస్ బుక్ కు తాత్కాలిక అంతరాయంపై నిర్వాహకులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘సారీ, సమ్ థింగ్ వెంట్ రాంగ్’... ఫేస్ బుక్ కు తాత్కాలిక అంతరాయంపై నిర్వాహకులు

సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఫేస్ బుక్ సైట్ ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న నెటిజన్లకు ‘సారీ, సమ్ థింగ్ వెంట్ రాంగ్’ అనే మెస్సేజ్ దర్శనమిస్తోంది. ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, సేవలు పునరుద్ధరిస్తామంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఇలా ఫేస్ బుక్ యాక్సెస్ కానిది కొద్దిమంది నెటిజన్లకు మాత్రమే. కాగా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమం కొద్ది సేపట్లో యాక్సెస్ కాకపోతే నెటిజన్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైనట్లే. ఎందుకంటే, ఈ మాధ్యమం ద్వారా కోట్ల మంది చాటింగ్ లు, ఫొటో షేరింగ్ లతో పాటు తమ అభిమాన నటీనటుల సందేశాలు, తమ క్షేమ సమాచారాలు ఇచ్చుకుంటూ వుంటారు.

More Telugu News