డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్ దంపతులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఈర్ ఈరోజు తన కారు డ్రైవర్ గరిపెల్లి బాలయ్య కుమార్తె రమ్యకృష్ణ వివాహానికి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్ లోని కల్యాణ మండపంలో గోదావరిఖని ప్రాంతానికి చెందిన రాజారాం మల్లేశ్ తో పెళ్లి జరిగింది. వివాహ ముహూర్తం ఉదయం 11 గంటలకు అయితే, సతీమణి శోభతో కలసి కేసీఆర్ పది నిమిషాల ముందే కల్యాణ మండపానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మెదక్ జిల్లా సిద్ధిపేట ప్రాంతానికి చెందిన బాలయ్య గత కొన్నేళ్లుగా కేసీఆర్ కు కారు డ్రైవర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

More Telugu News