మ్యాగీ హాట్ కేక్... స్నాప్ డీల్ లో సెకనుకు 200 ప్యాకెట్ల అమ్మకాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ్యాగీ హాట్ కేక్... స్నాప్ డీల్ లో సెకనుకు 200 ప్యాకెట్ల అమ్మకాలు

భారత ప్రభుత్వం నుంచి నిషేధాన్ని ఎదుర్కొని, ఆపై నాణ్యతా ప్రమాణాల పరీక్షల్లో విజయం సాధించి రెండు రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ లో ఈ ఉదయం మ్యాగీకి చెందిన 60 వేల వెల్ కమ్ కిట్లను అమ్మకాల్లో ఉంచగా, కేవలం 5 నిమిషాల వ్యవధిలో అన్నీ అమ్ముడయ్యాయి. కస్టమర్లు తమకు మ్యాగీపై ఉన్న ఆపేక్షను ఈ ఫ్లాష్ సేల్ లో చూపించారని స్నాప్ డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నావిన్ వెల్లడించారు. సరాసరిన సెకనుకు 200 కిట్లు అమ్ముడయ్యాయని వివరించారు. ఈ కిట్ లో 12 రకాల మ్యాగీ ప్యాకెట్లు, 2016 క్యాలెండర్, మ్యాగీ ఫ్రిజ్ మాగ్నెట్, పోస్టు కార్డులను ఉంచినట్టు ఆయన తెలిపారు. కాగా, నవంబర్ 9 నుంచి మ్యాగీ అమ్మకాలు దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

More Telugu News