Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాస్కెట్ బాల్ మ్యాచ్ లో సోనియా మనవరాలు... కూతురు మ్యాచ్ కోసం హర్యానాకు ప్రియాంకా

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మనవరాలు మిరయా వాద్రా నిన్న బాస్కెట్ బాల్ మ్యాచ్ లో పాల్గొంది. ఈ మ్యాచ్ కు హర్యానా పట్టణం జింద్ సమీపంలోని తక్షశిల ఇంటర్నేషనల్ స్కూల్ వేదికైంది. గుర్ గావ్ లోని శ్రీరామ్ స్కూల్ తరఫున మిరయా వాద్రా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో మిరయా గెలిచిందీ, లేనిదీ తెలియరాలేదు. అయితే తన కూతురు ఆడుతున్న మ్యాచ్ ను చూసేందుకు మిరయా తల్లి, సోనియా కూతురు ప్రియాంకా గాంధీ నిన్న పెద్ద సాహసమే చేశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి భద్రత లేకుండానే ఆమె మ్యాచ్ కు హాజరయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా తక్షశిల స్కూల్ చేరుకున్న ఆమె తన కూతురు ఆటను దాదాపు 40 నిమిషాల పాటు తిలకించారు.

More Telugu News